![]() |
![]() |
.webp)
సింగర్ రేవంత్ ప్రస్తుతం అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ సిక్స్ విజేతగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ తర్వాత ఎన్నో ఈవెంట్స్ కి వెళ్తూ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు రేవంత్.
రేవంత్ పూర్తి పేరు లొల్లవెంకట రేవంత్ కుమార శర్మ . ఇతను 1990 ఫిబ్రవరి 10 న శ్రీకాకుళంలో జన్మించాడు. తన చదువు మొత్తం విశాఖపట్నంలో చదివాడు. రేవంత్ కి చిన్నప్పటినుండి సింగర్ కావాలని ఉండేదట. అందుకే డిగ్రీ చివరి సంవత్సరంలోనే హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం ఎదురుచూసాడట. ఆడిషన్స్ కి వెళ్ళాలంటే కూడా తన దగ్గర డబ్బులు ఉండేవి కావట,దాంతో కేటరింగ్ కి వెళ్లి వచ్చిన డబ్బులు దాచుకొని, ఆడిషన్స్ కి వెళ్ళేవాడట. రేవంత్ సింగర్ కావడానికి చాలా కష్టపడ్డాడట. బుల్లితెరలో 2010 లో వచ్చిన సూపర్ సింగర్ -5 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. ఆ తర్వాత ఈటీవీలో వచ్చిన సప్తస్వరాలు ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. సూపర్ సింగర్-7 మరియు సూపర్ సింగర్-8 లో మెంటర్ గా ఉన్నాడు. అప్పటికే చిన్న సినిమాలలో అవకాశం వచ్చింది. కాగా 2017 లో తను పాడిన పాటలకు గాను 'Indian idol' విజేతగా నిలిచాడు. దానితో సింగర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. తరువాత పలు సింగింగ్ కాంపిటిషన్స్ కి మెంటర్ గా వ్యవహరించాడు. ఇప్పటివరకు తన కెరియర్ లో చాలా గౌరవ అవార్డులు అందుకున్నాడు. ఇప్పటివరకు రేవంత్ దాదాపు వందకు పైగా పాటలు పాడాడు.
తాజాగా రేవంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. అది అందరిని ఆలోచింపజేస్తుంది. అదేంటంటే.. కొన్ని సార్లు ఓవర్ స్ట్రెస్ హర్ట్స్ అని రేవంత్ ఓ పోస్ట్ చేశాడు. దీన్ని బట్టి అతను దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. అయితే తనని అంతగా ఆలోచింపజేసేది డబ్బు సమస్యా లేక ఇంకేదైనా సమస్యా అనేది అతనికే తెలియాలి. అయితే రెగ్యులర్ గా షూట్ కి వెళ్తున్నప్పుడు పోస్ట్ లు చేసే రేవంత్.. ఇలా పోస్ట్ చేయడంపై అతను మెంటల్ గా ఎక్కువ భాదపడుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి రేవంత్ ని అంతగా ఆలోచింపజేసేదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.
![]() |
![]() |